పక్షులు గుళ్ళు కట్టుకోవటం చూశాం . పుల్లా పుడకలతో అందమైన గూళ్ళ కడతాయి . అమెరికా కు చెందిన పోట్రిక్ డ గౌట్రి కూడా ఈ కాన్సెప్ట్ తీసుకొన్నాడు . పొడవాటి తీగలు సేకరించి ఏకంగా నలభై అడుగుల ఎతైన ఇళ్ళు అల్లేస్తున్నాడు. పక్షి గూడు కట్టే విధానం లగే ఉంటుంది ఇది . ఈయన ప్రకృతి ఆరాధికుడు చెట్ల కొమ్మల్ని తీగల్ని చాకచక్యంగా జతచేస్తూ గూడు అల్లికను ప్రారంభించారు . స్థానికంగా దొరికే వేపుల్ చెట్ల తీగలతో గుళ్ళను అల్లేశాడు కరోలినా మ్యూజియంలో తాను అల్లిక ఎన్నో రూపాలను ప్రదర్శనకు పెట్టాడు. ఈ కళను విశేష స్పందన వచ్చింది . ఇప్పుడు అమెరికా లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ పక్షిగూడు తరహా ఇళ్ళు నిర్మిస్తున్నాడితను .

Leave a comment