మల్కాన్‌గిరి జిల్లా బోండాఘాటీకి అనే అడవి ప్రాంతానికి చెందిన గిరిజన పోస్ట్ గ్రాడ్యుయేట్ మాలతి ని వాటర్ క్వీన్ అంటారు. భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్ చదవి మాలతి తాగేందుకు నీళ్లు దొరకని బోండాఘాట్ లో ముగ్గురు చెల్లెళ్లు సుక్రి, లిలీ, రంజిత లతో కలసి తవ్వేసింది. తండ్రి ఇచ్చిన ఏడువేల రూపాయలతో మోటారు కొని బురద నీళ్లు తోడేశాక తియ్యని దాహం తీర్చే నీళ్లు వచ్చాయి. ఈమెను చూసి ఇంకో కొన్ని యువబృందాలు మరో మూడు బావులు తొవ్వటం మొదలెట్టేరు. మాలతి గురించి రాసిన మీడియా మాలతి ని వాటర్ గర్ల్ గా పిలిచింది. ఇప్పుడిక తన బోండా తెగకు చెందిన పిల్లల కు చదువు చెప్పే పనిలో పడింది మాలతి.