Categories

బెనారస్,కంచి పట్టులాగా అస్సాం మూగా పట్టు చీరెలు కూడా ప్రత్యేకం .అస్సాం పట్టు చీరెలపైన జంతువులు,మొక్కల రూపాలు కనిపిస్తాయి. పాకే లతలు,పురివిప్పిన నెమలులతో అందంగా అంచుల్లో చీరెలపై నేస్తారు. ఎరుపు నీలం,ఆకుపచ్చ వంగపండు రంగులతో పాటు తెలుపు నలుపుపట్టు చీరెల నేత అస్సాం ప్రత్యేకత.ఎరుపు రంగు ,బంగారు రంగుల్లో ని మూగా పట్టు చీరెలు నాన్యమైనవి. ఖరీదైనవి. అస్సామీల జాపపద జీవతం ,ప్రకృతి మొత్తం ఈ పట్టు చీరెల పైనే కనిపిస్తుంది. ఇక్కడ తయారయ్యే పాటు పట్టుపిడికిట్లో ఇమిడేంత మెత్తగా ఉంటుంది.