జాగింగ్ ,వాకింగ్ లతో సరైన ప్రక్రియ అనుపరిస్తే ఫలితాలు చక్కగా ఉంటాయి అంటారు ఎక్స్ పర్ట్స్. ముందుకు చూస్తూ నిఠారుగా నడవాలి ,భుజాలు వెనక్కి ఉంచాలి. రిలాక్స్డ్ గా ఉండాలి. పొత్తికడుపు కండరాలు లోపలికి బిగబట్టాలి ,చేతులను నిధానంగా వెనక్కి ముందుకు స్వింగ్ చేయాలి.పాదాలలోని బాల్స్ పై ఆనించి ,కాలివేళ్ళు ముందుకు సాచి మడమ నేలకు తగలకుండా రన్నింగ్ చేయాలి.నిశ్శబ్దమైన పాదాల కదలిక అంటే అది సరిగ్గా పరుగుత్తే విధానం అన్నమాట. కాళ్ళు నేలని తాకుతున్నా సవ్వడి వినిపిస్తే సరిగ్గా పరుగెత్తటం లేదని అర్ధం .కీళ్ళు మొరాయిస్తే ఇబ్బంది కలిగిస్తే వెంటనే పరుగు మానేసి ప్రత్యమ్నాయం కోసం చూడాలి. కీళ్ళకు మేలు చేసే సైక్లింగ్ ,స్విమ్మింగ్ ,స్టెయిర్ క్లెయించింగ్ ఎంచుకోవాలి. ఏ వ్యాయామం అయినా మెదడు రసాయనిక చర్యను వెంటనే మార్చేస్తుంది.

Leave a comment