కమల్ హాసన్ మక్కల్ నీతి మయ్యం పార్టీ ప్రారంభించారు . అయనకు మద్ధతు ఇస్తానని చెప్పింది శృతిహాసన్.  అయన కూతురిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వపడుతాను . ప్రజలకు నాన్నపైన ఉన్న అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.  ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయం  ఆయన రక్తంలో ఉంది.  ఆయన తీసిన సినిమాలు ప్రజలపట్ల ,సమాజం పట్ల ఆయనకి ఉన్న ఇష్టం , ప్రజల పక్షాన నిలబడి వాళ్లందరి గొంతుకతో  తను మాట్లాడినట్లు ఉంటుంది. ఆయన ఎంతో సింపుల్ రాజకీయ ప్రస్థానంలో ఆయనకు తోడుగా ఉంటాను అంటోంది శృతిహాసన్.

Leave a comment