పసి వాళ్లు రాత్రి వేళ సుఖంగా నిద్రపోకుండా అస్తమానం లేస్తూ ఉంటే , కనీసం నాలుగైదు గంటలు కూడా నిద్ర పోకపోతుంటే అది భవిష్యత్ లో వచ్చే అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చని అంటున్నారు డాక్టర్లు.  సాధారణంగా పక్కతడుపుకొనే, ఏదైనా శబ్దానికి పిల్లలు నిద్రతో కదిలిన వెంటనే పడుకొంటారు .  కానీ మాటి మాటికీ నిద్ర లేస్తున్న అలా లేచినప్పుడు వాళ్లని నిద్రలో ఉన్న తల్లీదండ్రులు పట్టించుకోకుండా ఉన్న పిల్లల ప్రవర్తనలో తేడా వస్తుందంటున్నారు. ఈ సమస్యకు జన్యువులు లేదా వాతావరణం కారణం కావచ్చు కానీ సమస్య గుర్తించిన వెంటనే తల్లీదండ్రులు స్పందిస్తే పిల్లు చక్కగా నిద్రపోయేలా చేయవచ్చని , తర్వాత శరీరంలో ఏదైనా సమస్య ,లోపం ఉన్న సరిచేయవచ్చనీ డాక్టర్లు చెపుతున్నారు.

Leave a comment