చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వటం వల్ల టీనేజ్ లైఫ్ చాలా మిస్ అయ్యాను అలాగే కాలేజీ లైఫ్ కూడా నాకు లేదు అంటుంది సితార. 37 సంవత్సరాల నటజీవితం వందకు పైగా సినిమాల్లో నటించి ఇప్పుడు బుల్లితెర ఓటీటీ ల్లో కూడా కొత్త కెరీర్ మొదలు పెట్టింది సితార. కోవిడ్ తర్వాత ఇప్పుడే జీవితం మళ్ళీ గాడిలో పడుతోంది. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నాను. ఆసక్తికరమైన పాత్రల కోసం చూస్తున్నాను ఇప్పటివరకు తెలుగు లోనే ఎక్కువగా యాక్ట్ చేశాను. ఈ ఏడాది తమిళ, మలయాళ సినిమాల పైన దృష్టి పెట్టాను. 1985లో సినిమాల్లో కి వచ్చాను. 37 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ ఎంతో సర్ ప్రైజింగ్ అదృష్టం గా అనిపిస్తుంది ఉంటుంది సితార.

Leave a comment