Categories
సినిమాల్లో టీచర్ పాత్ర ధరిస్తే ఎలా ఉండేదో కాని నిజ జీవితంలో రంగారెడ్డి జిల్లా స్కూల్లల్లో పాఠాలు చెప్పేందుకు సిద్దమైపోయింది రకుల్ ప్రీత్ సింగ్. టీచ్ ఫర్ ఇండియా స్వచ్చంద సంస్థ 100 పాఠశాలలు దత్తత తీసుకుంది. ఆ స్కూళ్ళలో రకుల్ పాఠాలు చెప్పేందుకు ఒప్పుకుంది. భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోంటుంది. ఇలాంటప్పుడు పిల్లల మధ్య చాలా సామన్యంగా ఉండటం నాకు ఇష్టం. నా సెలబ్రిటి వ్యవహారం పిల్లలకు దగ్గరగా తీసుకురాను. వాళ్ళ కోసం ఏ కొంచెం అయినా నేను చేయగలిగితే అంతే సంతోషం అంటుంది.