Categories
మధ్య వయసు దాటాకా ఆలోచన శక్తి,జ్ఞాపక శక్తి పెరగాలంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఓ గంట పాటు ఖచ్చితంగా నిద్రపోవలసిందే అంటున్నారు అమెరికా పరిశోధకులు. కొన్ని వందల మందితో అధ్యయనం సాగింది, కొందరిని భోజనం తర్వాత నిద్ర పొమ్మని , మరి కొందరిని మెలకువలో చురుగ్గా గడపమని సూచించారు. నెల రోజుల తర్వాత , విశ్రాంతిగా నిద్రపోయినా వారు చురుగ్గా ఆలోచించటంతో పాటు జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉందని రికార్డు అయింది. జపనీయులపైన చేసిన ఈ పరిశోధన 50 ఏళ్ళు దాటిన వారు ఆరోగ్యంగా చురుగ్గా ఉండలాంటే నిద్రే మార్గం అని తేల్చింది.