
గుండె జబ్బుల విభాగంలో మహిళా డాక్టర్లు తక్కువే కనిపిస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా గుండె జబ్బులు,గుండె ఆపరేషన్ విభాగంలో మహిళలు ఎంతో మంది లేరు.కానీఇ ఒక తాజా అధ్యయానం మహిళా డాక్టర్ల పర్యవేక్షణలో గుండె జబ్బులున్నా రోగులు త్వరగా కోలుకున్నారని తేలింది.ఒక పదేళ్ళ కాలంలో అమెరికాలోని ఫ్లోరిడాలో గుండె జబ్బున్న ఐదు లక్షలు ఎనభైరెండు వేల మంది పై జరిపిన అధ్యాయనంలో ఈ విషయం తేలింది.హృద్రోగానికి సంభందించి ఒత్తిడిని రోగులు మహిళా డాక్టర్ల శ్రద్ద వల్ల స్వాంతన కలిగించే వారి మాటల్లోనూ కోలుకున్నారట.