ది షూటింగ్ స్టార్ ఏ గర్ల్ ఆఫ్ బ్యాక్ ప్యాక్ అన్డ్ ది వరల్డ్ అన్న పుస్తకం వచ్చింది. పెగ్లిన్ రామ్ డమ్ హెన్ వారు ప్రచురించగా దీని రచయిత్రి శివ్యానాథ్  తన యాత్ర అనుభావాలను ఈ పుస్తకంలో రాశారు.ఆమెది డెహ్రడూన్ ఆక్కడి నుంచి ఆగ్నేయ ఆసియా దేశాలన్ని చుట్టి వచ్చారు. రైళ్ళు,విమానాలు,బస్సుల్లో ప్రయాణించి రకరకాల మనుషులను కలుసుకున్నారు. ఇండియాలో ఆమె విహరించని ప్రదేశం లేదు. ఈ పర్యటక అనుభవాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఒంటరి ప్రయాణాలు మహిళలు ఇష్టంగా చేయాలి అనిపించేంత బాగా రాశారు శివ్యానాథ్ చక్కని రచనా శైలీతో తన ప్రయాణంలో తాను కలుసుకున్న మనుషులు మన్సాన్ తెగలతో గడిపిన జీవితం ఎంతో భాగా రాశారు. సోలోగా ప్రపంచం చూడాలనుకుంటే ముందు ఈ పుస్తకం చదవండి.

Leave a comment