అమెరికాలో వ్యాపారం కోసం పెంచే పువ్వులలో చామంతికి మొదటి స్థానం ఇచ్చారు.వేల వేల రంగుల్లో పూసే చామంతుల్లో చైనా,జపాన్ లలో కిచెన్ గార్డెన్ లో పెంచే ఛామంతి అనేక అనారోగ్యాలకు ఔషధం. పసుపు,తెలుపు రంగుల్లో ఉండే ఆ చామంతి తినే చామంతిగా చెబుతూ దాని లేత ఆకులను వేపుళ్ళు,సూప్ లు, సలాడ్ లలో ,టీ లో కూడా వాడతారు.చామంతి టీలో విటమిన్లు,ఖనిజాలు,అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని అవి గుండే,నరాలు,చర్మం ,ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయని దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించి జీవక్రియ పెంచుతాయంటున్నారు.

Leave a comment