ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా పని చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జలుబు సాధారణ సమస్యగా పైకి కనపడుతుంది. కొన్ని సందర్భాలలో ప్రనంతకంగా మారే అవకాసం వుంది. జలుబు నుంచి విముక్తి కి విటమిన్-డి వాడండి అంటున్నారు. క్వీన్ యూనివర్సిటీ పరిశోధకులు 14 దేశాలల్లో 11 వేల మంది పైన ఈ పరిశోధన జరిగింది. తీవ్రమైన జలుబు తో బాధ పడే వారికి క్రమం తప్పకుండా విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చారు. క్రమేపి జలుబు తగ్గిపోతుంది. కొంతసేపు ఎండలో తిరిగితే విటమిన్-డి అందుతుంది అంటారు. కానీ దాని వల్ల లాభం లేదని విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పుతున్నారు. సో జలుబు వస్తే ఈ విటమిన్ గురించి గుర్తు చేసుకోవాలి.

Leave a comment