Categories
వంటగదిలో వాడే కిచెన్ టవల్స్ ఆహారం విషపూరితం కావాడానికి కారణం అవుతాయని పరిశోధకులు గుర్తించారు.వంటగది శుభ్రం చేసేందుకు ఉపయోగించే రసాయనాలు ,పాత్రలు తోమే లిక్విడ్స్,కిచెన్ గరిటెలు ,పాత్రలను తోమె టవల్స్ లో ఈ పదార్ధాలన్ని చేరుకుని వీటిలో భాక్టిరియా పెరుగుతుందని అందువల్ల ఆహారం విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్స్ వివరిస్తున్నారు.కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంటే టవల్ ఎక్కువసేపు తడిగా ఉంది భ్యాక్టిరియా మంరింత పెరుగుతుందన్నారు.పాత్రల్ను తుడవడం వంటి పనులకు వాడే కిచెన్ టవల్స్ పై పొడి టవల్స్ కంటే ఎక్కువగా భ్యాక్టీరియా ఉంటుందన్నారు. వీటిని వేడీ నీటిలో డెట్టాల్ లో ఉతికి ఆరేయాలని వంటగదిలో తడి టవల్స్ ఎప్పటికప్పుడు ఆరనివ్వలంటున్నారు.