సాధారణంగా పల్లెల్లో ఉండే వారు చక్కని ఆరోగ్యంతో ఉంటారు.పచ్చగా ఉండే ప్రదేశాలు తక్కువ వాయుకాలుష్యం శబ్దకాలుష్యం ,చల్ల నివాసాలు సగం ఆరోగ్యం ఇస్తాయి. అందుకే శాస్త్రవేత్తలు సహజమైన వాతావరణానికి అలవాటు పడమని చెపుతున్నారు. గ్రామాల్లో చక్కని వాతావరణం అంటే కేవలం పరిశుభ్రమైన పర్వత ప్రాంతాలలోనూ ,సముద్రతీరాలలోనూ ,గ్రామాల్లోనూ ఆరోగ్యం దాగి ఉండదు, మనుష్యులు జీవించే పరిసరాలు వారి నేపథ్యం జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ,పడేఒత్తిడి ,సమస్యలు ఇవన్నీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని పరిశోధకులు నిర్ణయించారు.ఇవన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూసిస్తాయి. సాధ్యమైనంత వరకు ప్రకృతికి దగ్గర ఉంటూ ,ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకొంటూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఒత్తిడిని ఎదర్కొగలిగే మానసిక స్థైర్యాన్ని అలవర్చుకోంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారు.
Categories