సుఖ నిద్రకు చిట్కాలున్నాయి అంటారు పెద్దవాళ్ళు.రాత్రి వేళ నిద్రించే గదిలో చిన్న దీపం మాత్రమే ఉంచుకోమంటున్నారు. అది చిన్న పాటి కదలికల కోసమే. వెలుగైన దీపాలు నిద్రకు భంగం కలగిస్తాయి. నిద్రించేప్పుడు కాళ్ళకు సాక్సో్ వేసుకోవంటున్నారు. సాక్స్ తో పాదాలు కావాలిసిన వేడిని పొందుతాయి. కర్త ప్రసరణ బావుంటుంది. అలాగే పగటి పూట 15,20 నిమిషాలు మించి నిద్ర పోకూడదు. తినగానే నిద్రకు ఉపక్రమించవద్దు. ప్రతి రోజు ఒకే సమయంలో నిద్రపోవాలి. ఉదయం వేళ మాత్రమే కాఫీ టీలు తాగి ఇక ఆ తర్వాత చెర్రీ జ్యూస్ లేదా మల్లెపూల టీ మొదలైనవి తీసుకోవద్దు. సోషల్ మీడియా ఉపకరాణాలు ఆపేయాలి. లేకుంటే నీలికాంతి నిద్రను పాడు చేస్తుంది. రాత్రి వేళ వేడి నీటి స్నానం పనిఆతో అలసిపోయినా కండరాలకు విశ్రాంతి ఇచ్చి ఉత్సహాం నింపుతుంది. కర్త ప్రసరణ బావుంటుంది .సఖనిద్రకు ఇవన్ని మార్గాలే.
Categories