Categories
కాన్పు కాన్పుకు ఎడం ఉండాలని ఎప్పుడూ డాక్టర్లు చెపుతూనే ఉంటారు. వెంట వెంటనే గర్భం వస్తే తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. లక్షన్నర మంది మహిళలపైన జరిపిన అధ్యయనలో ప్రసవం తరువాత పన్నెండు నెలలలోగా గర్భవతి అయితే నెలలు నిండకుండా పిల్లలు పుట్టటం, తగినంత బరువు లేకుండా ఉండటం పుట్టిన కొద్ది నెలల్లోనే శిశువు మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తల్లి వయసును బట్టి వరస ప్రసవాలు అనారోగ్య హేతువులే అంటున్నారు. వీటి ప్రభావం తల్లి పైనే కాదు,పుట్టే పిల్లలపైన కూడా ఉంటుంది. గర్భసంచిలో శిశువు స్థిరపడటంతోనే సమస్యలు మొదలై శిశువు ఎదుగుదలకు కూడా ప్రమాదమే అంటున్నాయి అధ్యయనాలు.