ఒక ఏడాదిలోనే వంద జానపద గీతాలు పాడింది శిరీష.అత్త కొడుక ముద్దుల మరెల్లయ్య జానపద గీతం తో యూట్యూబ్ లో మొదటి సారి గొంతును వినిపించింది శిరీష. ఈ పాటకు రెండుకోట్ల వ్యూస్ వచ్చాయి. అలాగే ఏమే పిల్ల అన్నప్పుడల్లా పాడి 6.8 కోట్ల వ్యూస్ దక్కించుకుంది. పొడి పొడి వానలు పాటతో ఆమె అందరికీ నచ్చేసింది.  ఆమెది సిరిసిల్ల చేనేత కుటుంబం తండ్రి ఆర్.ఎం.పి గా పని చేస్తాడు ఈ పాటలన్నీ వింటుంటే నేనేనా పాడాను అనుకుంటాను లక్షల మందికి నా పాట నచ్చటం ఎంతో సంతోషాన్నిచ్చింది నా పుట్టినరోజు నాడు  ఊళ్లో ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకం చేశారు ఇంతటి గౌరవం నాకు దక్కింది అంటే ఈ జానపద గీతాలు పాడటం వల్లనే చిన్నప్పటి నుంచి వింటాను. నేర్చుకున్న పాటలే ఇవి అంటోంది శిరీష మట్టి వాసన పరిమళం వచ్చే పల్లె పదాలు ఎవరికైనా నచ్చుతాయి కదా !

Leave a comment