ఇంట్లోనే నడక యోగా చెయ్యచ్చు 25 నిమిషాలు వ్యాయామం సరిపోతుంది.వ్యాయామంతో పాటు పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటోంది బాడీ బిల్డర్ సోనాలి స్వామి.ఇద్దరు పిల్లలు పుట్టాక బాడీ బిల్డింగ్ మొదలు పెట్టి పతకాలు సాధించారు ఈ నలభై రెండు సంవత్సరాల సోనాలి.మెరుగైన ఆరోగ్యం కోసం కూరగాయలు తాజా పండ్లు తినాలి పరిమితికి మించి తింటే వ్యాయామంతో కరిగించ లేని అదనపు కేలరీలు పెరుగుతాయి అంటోంది సోనాలి.కరోనా వైరస్ భయంతో ఇప్పుడు అందరిలో ఫిట్ నెస్ ఆసక్తి పెరిగింది.వ్యాయామాలు సాధన చేస్తూ ఫిట్ గా ఉంటే కరోనా తో పాటు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది అంటోంది  బాడీ బిల్డర్ సోనాలి.

Leave a comment