ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుంతకల్ మండలం లోని కసాపురం గ్రామంలో ఉన్న ఆంజనేయుల వారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి.

మహిమ గల దేవుడు.నెట్టికంటి అంటే మంచిరాయి అని,ఒంటి కన్ను అని అర్ధం.ఈ దేవాలయం అతి పురాతనమైనది.స్వామి వారు తన కుడి కన్నుతో భక్తులకు అభయంతో కూడిన వరాలు ప్రసాదిస్తాడు అని పురాణ గాథలు చెబుతున్నాయి.ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు, అప్పాలు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment