ఎంతో మంది సమాజాన్ని ప్రభావితం చేస్తారు కానీ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు అందునా ఆ స్థాయి కి ఎదిగిన మహిళలు చాలా తక్కువ మందే  ఉంటారు . కానీ ఆ మహిళలు చేసిన కృషి వృధాపోదు . ప్రపంచం గుర్తించి సత్కరిస్తుంది . ప్రతి సంవత్సరం ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహిళలను గుర్తించే అంతర్జాతీయ సంస్థలు బి బి సి ,ఫోర్ట్స్ ,టైమ్స్ వంటివి వందమంది మహిళల జాబితా తాయారు చేస్తారు . అందులో పలువురు భారతీయ మహిళలు కూడా కన్పిస్తారు . సామజిక ,సైంటిఫిక్ ,వాణిజ్య,వ్యాపార,ఆర్థిక రంగాలలో అద్భుతమైన ప్రతిభతో ఉన్నత స్థానాలకు ఎదిగి ఎంతో ఆదర్శంగా వుంటూ ,జాతి గర్వించే మహిళలుగా నిలుచున్నా వారిలో ఈ సంవత్సరం భారతదేశ తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ,బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజునాధ్ ,హెచ్ .సి. ఎల్ కార్పొరేషన్ సి.ఇ .ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోష్ని నాడార్ ఉన్నారు .

Leave a comment