యోగాసనాలతో మానసిక సామర్థ్యం వృద్ధి చెందుతుంది అంటున్నారు పరిశోధకులు . ఏరోబిక్ వ్యాయామంతో మెదడులో లబ్ది పొందే ప్రాంతాల్లో నాడీ సందానతలను  యోగ మెరుగుపరుస్తుందని వెల్లడైంది . యోగతో మెదడు లోని హిప్పో క్యాంపస్ పరిమాణం పెరుగుతుంది . మతిమరుపు ,అల్జీమర్స్ తో మొదట ప్రభావం అయ్యేది ఈ ప్రాంతమే . భావోద్వేగాల నియంత్రణ లో పాత్ర పోషించే అమిగ్డలా అనే భాగం పెద్దగా ఉంటుంది . యోగాతో ప్రీ పాంటల్స్ ,కార్టెక్స్ ,సింగులేట్ కార్టెక్స్ వంటి భాగాలు పెద్దగా సమర్థం గా తయారవుతాయి . సరైన నిర్ణయాలు తీసుకోవటం . సరైన పనిని ఎంచుకోవటం లో ప్రీ పాంటల్స్ కార్టెక్స్ చాలా అవసరం . నిత్యం యోగా చేస్తే మెదడు సమర్థవంతంగా పనిచేస్తుందని అధ్యయన కారులు చెపుతున్నారు .

Leave a comment