పూణెకి చెందిన శీతల్ రాణే మహాజన్ చీరెకట్టి స్కై డైవింగ్ చేసిన మహిళగా రికార్డు సృష్టించింది. మహారాష్ట్ర నవారీ చీరె కట్టి థాయ్ లాండ్ లో 13వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి కిందకు దూకిన మహిళగా సరికొత్త రికార్డు దక్కించుకుంది.తొమ్మిది గజాల పొడవున్న ఆ భారీ చీరెను కట్టుకునేందుకు తాను భారీ కసరత్తు చేయల్సి వచ్చిందని చెబుతుంది శీతల్. ఈ స్కై డైవింగ్ తో కలిపి ఆమె ఇప్పటిదాక 18 జాతీయ రికార్డులు 6 అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పింది శీతల్ మహాజన్.

Leave a comment