తెమరి హ్యాండ్ బాల్స్ చైనా జపాన్ ల కు చెందిన సాంప్రదాయ కళ.( Temari balls ) కొత్త ఏడాది ప్రారంభానికి గుర్తుగా ఇంట్లోనే పెద్దలు పిల్లలకు వీటిని తయారు చేసి ఇవ్వడం ఆనవాయితీ.ధర్మకోల్ బంతి పైన రంగు రంగుల ఊలు న  సూదితో ఎంతో నైపుణ్యంతో కుడితే ఈ అందమైన బాల్స్ తయారవుతాయి. అద్భుతమైన కళ్ళు చెదిరే రంగుల దారాలతో ఎంబ్రాయిడరీ చేసినట్లు కనబడే ఈ బంతులను స్నేహానికి, నమ్మకానికి, ప్రతీకలుగా భావిస్తారు ఈ కళ వారసత్వంగా ఇంట్లో పిల్లలు నేర్చుకుంటూ తర్వాతి తరానికి అందిస్తూ ఉంటారు ఈ బంతులను ఇంట్లో వేలాడదీసుకొవటం అదృష్టంగా భావిస్తారు.వీటిని తయారు చేసే విధానం యూట్యూబ్  వీడియోలో చూడొచ్చు.

Leave a comment