సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన దీపికా పడుకొణే వైవాహిక బాంధవ్యపు రుచులను ఆస్వాధిస్తు ఉన్నా అంటోంది. రణవీర్ భగవంతుని బిడ్డ .అందరినీ సంతోషంగా ఉంచగల మనస్తత్వం .ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేయటం అతని ప్రత్యేకత అంటోంది దీపికా. రణవీర్ సింగ్ నా జీవిత భాగస్వామి కావటం నా అదృష్టం అతని జీవితంలో మంచి చెడులు ఏం జరిగినా జీవితంపట్ల అతని దృక్పథం ఒకేలాగా ఉంటుంది. ఇక నావరకు నేనెప్పుడు నేల పైనే ఉంటాను. సూపర్ స్టార్ ట్యాగ్ నాకేమి గర్వం అనిపించదు. విజయాలు తాత్కాలికం అవి ఉన్నంత కాలం ఉంటాయి. రేపేలా ఉంటుందో మనకేం తెలుసు. పని అస్వాధిస్తూ ఉంటే విగతావన్ని మామూలుగా జరిగిపోతూ ఉంటాయి అంటోంది దీపికా.

Leave a comment