Categories
అందమైన గోడ పైన చక్కని నెమలి వంటి వాల్ వాచ్ ఉంటే ఎంతో బావుంటుంది. బంగారు వెండి రంగుల్లో రాళ్ళు పొదిగిన ఫించంలో సాదా గోడపైన నెమలి మెరిసిపోతుంది. లేదా పంకీ గా నెమలి ముక్కు వేలాడే తెల్లని వాల్ ఉంటే ఒక్క నెమలే కాదు మెరిసే రాగి వర్ణంతో సూర్యుని కిరణాలు కావచ్చు. ఎథ్నిక్ మార్బుల్ వాచ్ కావచ్చు. ఎగిరే సీతాకోక చిలుకలు అందమైన లతలతో వుడెన్ వర్క్ గడియారాలు ,లెడ్ లైట్స్ తో మార్బుల్ వాల్ క్లాక్స్ లేనిదే గది అలంకరణ పూర్తి కాదు. లేదా గోడ మొత్తానికి ఈ చక్కని వాల్ క్లాక్ హాల్ డెకోరేషన్ గా అమరిపోవచ్చు. కాలాన్ని తెలిపే గోడ గడియారాలు అలంకరణ లో భాగమై కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి.