Categories
స్త్రీలు కానీ ,పురుషులు కానీ రాత్రి వేళల్లో రెండు కంటే ఎక్కవ సార్లు మూత్రానికి నిద్ర లేస్తూ ఉంటే ఇది వారి ఆయష్షును ప్రభావితం చేస్తుందంటున్నారు పరిశోధకులు. ఈ సమస్య పెద్దవాళ్ల కంటే చిన్న వాళ్లకే అధికం అంటున్నారు. 20 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్లు రాత్రి వేళ మూత్రం కోసం తరుచుగా లేస్తూ ఉంటే నిద్ర భంగం అవుతుందని ,ఈ నిద్ర సరిగా లేకపోవటం వల్ల ఇతరాత్రా అనారోగ్యాలకు దారి తీస్తుంది అంటున్నారు. మూత్రశయం అతి చురుగ్గా పని చేయటాన్ని నియంత్రించేందుకు మందులతో చికిత్స తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. రాత్రి వేళ ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవద్దని ఇందు వల్ల కూడా ఈ ఇబ్బంది రావచ్చనీ చెబుతున్నారు.