తన అందమైన నవ్వు ,చక్కని కళ్ళు చూసి తనకు సినిమాలో ఆఫర్ వచ్చింది అంటోంది సిద్ది ఇద్నానీ. ఈ అమ్మాయి జంబలకిడి పంబ సినిమాలో నటించింది. మా అమ్మ గుజరాతీ సీరియల్స్ లో హిందీ సీరియల్స్ లో నటించింది. చిన్నప్పటి నుంచి అమ్మతో కలిసి తను నటించే సినిమాలు సెట్స్ కి వెళ్ళేదాన్నీ సహాజంగా నాకు ఫీల్డంచే చాలా ఇష్టం కలిగింది. గుజరాతీలో ఒక సినిమా చేశాను .నా దృష్టిలో నవ్వించటం చాలా కష్టం అన్ని రసాల్లోనూ హాస్యం చాలా బరువైంది. పైన భాష తెలియక పోతే ఇంకా కష్టం అయినా భాష కంటే భావాలు ముఖ్యం అనుకొంది. అందుకే తెలుగు రాకపోయినా ఇక్కడ పని చేయ గలుగుతున్నాను అంటోంది సిద్ది ఇద్నానీ.

Leave a comment