Categories
ప్రొద్దుటే వ్యాయామాలు మంచివే కానీ,ఖాళీ కడుపుతో మంచిది కాదు అంటారు ఫిట్ నెస్ ఎక్స్ ఫర్ట్స్. కాంప్లెక్స్ ,సింపుల్ కార్బోహైడ్రేడ్స్ తినాలి. దీని వల్ల వర్కవుట్లు చేస్తున్నంత సేపు శక్తి నెమ్మదిగా స్థిరంగా ఉంటుంది.రోజంతా ఎనర్జీ ఉంటుంది. ట్రైనింగ్ కు గంట ముందు తినాలి. అరటిపండు కానీ ఏదైనా గంట ముందే తినాలి. సమయం చాలదు అనుకొంటే స్ముథీ సరైనా ఛాయిస్. లోఫ్యాట్ యోగర్ట్ ఫేవరెట్ అనుకొంటే ఫ్రూట్ స్లైస్ తినాలి.ఒక వేళ ఉద్యోగం చేస్తూ సాయంత్రం వేళ ఎక్సర్ సైజ్ లకు సమయం ఉంచుకోవాలంటే ఎక్కువ కూరలతో గల పూర్తిస్థాయి గోధుమ శాండ్ విచ్ తినాలి. వర్కవుట్స్ చేస్తూ మధ్యలో నిమ్మరసం లేత కొబ్బరి నీళ్ళు తాగవచ్చు.