ప్రతి మనిషి జీవితానికి కుటుంబం కేంద్రం. దాన్ని ప్రేమించని వాళ్ళు ఉండరు. అలాంటి బలమైన ,ప్రేమ పూరితమైన బాంధవ్యం ఉంటేనే ఒత్తిడి అనేది తలెత్తకుండా ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. మానసికంగా కుంగిపోయి ఒత్తిడితో ఉంటే రానురాను అది పెను భూతంగా మారుతోంది. దాన్ని ఎదుర్కొగల మార్గాల్లో ఒకటి. మనల్ని సపోర్ట్ చేసి ప్రేమించే వారి పోటోలను చూడటం .ఇది మెదడుకు ఇబ్బంది కలిగించే విషయాలను నెమ్మదింపజేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. కుటుంబ సభ్యుల ఫోటోలు మెదడుపై అనుకూల ప్రభావం చూపెడతాయి. లివింగ్ రూమ్ లో పడక గదిలో కుటుంబ సభ్యుల ఫోటోలు ఉండాలి. అలాగే మన పర్స్ లో హాండ్ బ్యాగ్స్ లో కూడా ఉంచుకోవాలి. మనసుకి ఒత్తిడిగా అనిపిస్తే ఫోటోలు కాసేపు చూస్తే కాసేపటికి తేడా తెలిసిపోతుంది.

Leave a comment