మెదడు పాదరసం మాదిరిగా పని చేయాలి అంటే ఎప్పటికప్పుడు పదును పెడుతూ పోవాలి. కండరాల వంటిదే మెదడు కూడా. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయకపోతే కండరాలు ఏ విధంగా స్టిఫ్ గా అయిపోతాయో మెదడు అంతే. ఫిజల్స్ బోర్డ్ గేమ్స్,కార్డ్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ మెదడుకు పదును పెడతాయి. మిగతా శరీరం మాదిరిగా మెదడు ఆశాజనకంగా పని చేయాలి అంటే పోషకాల అవసరం ఎంతగానో ఉంటుంది. సమతుల్యాహారానికి తోడు మల్టీ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ లభించే పళ్ళు కూరగాయాలు తినాలి. ఆహారపదార్థాల ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో తీసుకోవాలి. అప్పుడు మెదడులో ప్రీ రాడికల్స్ తో పోరాడటం ద్వారా అల్జీమర్స్ ని నిరోధిస్తాయాని నరిశోధనలు చెపుతున్నాయి.

Leave a comment