ఈనెల 15వ తేదిన ఢిల్లీలో జరుగనున్న 71వ ఆర్మీడే పరేడ్ ఒక చరిత్ర సృష్టించనుంది. 144 మంది జనాన్ లు ఉన్న ఆర్మీ కాంటింజెంట్ లెఫ్టినెంట్ భావనా కస్తూరి నాయకత్వం వహించనున్నారు. అసలీ ఆర్మీ సర్వీసెస్ కాంటింజెంట్ ఇరవై మూడేళ్ళ విరామం తర్వాత మళ్ళీ ఈ పరేడ్ లో పాల్గొనబోతోంది. 2015 అక్టోబర్ లో ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ అయిన భావనా కస్తూరి ఇప్పుడు ఆర్మీ కాంటిజెంట్ కు సారథ్యం వహిస్తుంది.