షాంపూ లో కూడా రసాయనాలు ఉంటాయి. రసాయనాలు లేని షాంపూ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఉసిరి పొడి, కుంకుడుకాయ, శీకాకాయ, మెంతులు 100 గ్రాములు చెప్పు నా తీసుకోవాలి బాగా ఎండనివ్వాలి బాగా ఎండిపోయాక వాటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం పూట దానిలో ఇంకో గ్లాసు నీళ్లు పోసి సన్నని మంటపై ఉడికించాలి. తరువాత చల్లార్చి వడగట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. తలస్నానం చేసేందుకు ఈ నీళ్లు చక్కగా సరిపోతాయి. దుమ్ము ధూళి వదిలి కుదుళ్ళకు పోషణ అంది జుట్టు రాలడం తగ్గుతుంది. పూర్వపు రోజుల్లో తలస్నానం కోసం ఉపయోగించింది ఇదే.

Leave a comment