Categories
కొన్ని పువ్వుల ఫేస్ పాక్ తో మొహం మేరిసి పోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తామర పువ్వులో లనోలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పువ్వుతో ఫేస్ పాక్ చేస్తే చర్మంపై రంధ్రాలు సాగకుండా బిగుతుగా ఉంటాయి. తామర పువ్వు రెక్కలు గుజ్జుగా చేసి అందులో సెనగ పిండి ,పసుపు కలిపి ఫేస్ పాక్ వేసుకోవచ్చు. అలాగే మల్లెపూల పాక్ కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది.ఇది యాంటీ పెప్టిక్ ఏజింట్ లాగా పని చేస్తుంది. చర్మంపై ఏర్పడ్డ మరకలు పోతాయి. స్కిన్ టానింగ్ తగ్గుతోంది. చల్లని పెరుగు కలబంద గుజ్జు,మల్లె పూల గుజ్జు కలిపి ఫేస్ పాక్ వేసుకోవాలి. ఇది మల్లెపూల సీజన్ లో ప్రతి రోజు వేసుకోవచ్చు. అలాగే బంతి పూల గుజ్జులో పచ్చిపాలు ,నిమ్మరసం వేసి ఫేస్ వేసుకోంటే ఇది యాంటీ సెప్టిక్ ఏజింట్ లాగా పని చేస్తుంది.