నల్లని పట్టులాంటి జుట్టు ఎవరికైనా ఇష్టమే. మరి అలంటి జుట్టుకు ఆలివ్ నూనె, కలబంద మంచి మందు. కాలంతో సంబంధం లేకుండా జుట్టు పోదిబరినట్లు వుంటే ఆలివ్, కొబ్బరినునేల మిశ్రమాన్ని సమపాళల్లో తీసుకుని మరిగించాలి. కాస్త చల్లబరిచి జుట్టుకు పట్టించి ఓ గంటాగి తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరిసిపోతుంది. ఒక్క సారి తలస్నానం చేసినా మెరుపు కనిపించదు. అప్పుడు గ్రీన్ టీ మరిగాక కాచి అందులో కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి జుట్టు కుదుళ్ళ నుంచి కోణల దాకా తడపాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చుల్లా మెరుపులు మెరుస్తుంది. అలాగే కొబ్బరి పాలలో ఓ చంచా ఆలివ్ నూనె, కలబంద గుజ్జు గుడ్డులోని తెల్ల సోన కలిపి హెయిర్ పాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మెరుపులు మెరుస్తూ పట్టులా వుంటుంది.
Categories