నీహారికా,

ఎమోషనల్ ఇంటలిజెన్స్ ను మెరుగుపరచుకోవడం ఎలా అన్నావు, భావోద్రేక సంబందిత మేధావితనం తప్పక ఉండాల్సిందే. ఇది వ్యక్తిత్వానికి, ఎదుగుదలకు కావలిసిన మార్గం. దాన్ని మెరుగుపరచుకోవడం అంటే ముందు మన అభిప్యాయలు, ప్రవర్తనలు, ప్రతి స్పందనల పట్ల మనం ఎలర్ట్ గా ఉండాలి. మనం ఫ్లెక్సిబుల్ గా వుండాలి కానీ, ముక్కుసూటిగా అనుకుంటూ పట్టుబట్టి వుండటం సరికాదు. విధి నిర్వహణలో ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఎలా వున్నాయో గుర్తించాలి. అవకాశవాదం వైపు దృష్టి పోనీయకూడదు. ఇతరులను అధిగమించాలనే పోటీ తొందర పాటు వద్దు. సహోద్యోగుల్ని ప్రశంసించే గుణం వుండాలి. బలహీనతల్ని గుర్తించాలి, అంగీకరించాలి, అధిగమించాలి. ఒత్తిడి ఏర్పడిన క్షణంలో ప్రతి పనీ ధైర్యంగా ఎదుర్కోగలననే మానసిక బలం సమకూర్చుకోవాలి. పరిస్థితులు సరిగా లేకపోతే ఇతరులను బ్లేమ్ చేయొద్దు. ముందుగ ఆత్మ శోధనలో పడాలి. మన తప్పు గుర్తించి మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఆ సంక్షోభం లోంచి బయట పడాలి.

Leave a comment