ఎన్నో ఆహార పదార్దాలు నిల్వ చేసే టప్పుడు, వాటిని వండేటప్పుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగాళా దుంపలు బాగా పెద్దవిగా వస్తు వున్నాయి మార్కెట్ లో కానీ చిన్న దుంపల్ని తీసుకుంటే వాటిని చెక్కు తీసె పని ఉండదు. ఆ చెక్కులో వుండే పిచులో మనకు 50 శాతం ఫాలి ఫినాల్స్ అందుతాయి. పాలకూర సలాడ్ లో వేసే ముందర కొన్ని నిమిషాలు పెనం పైన వేడి చేస్తే అందులోని విటమిన్-ఎ శాతం మూడు రెట్లు పెరుగుతుంది. ద్రాక్ష పండ్లు ఫ్రిజ్ లో పెట్టక పోవడం మంచిదే. బయట టేబుల్ పైన గాలి లో ఉంచితే వాటి పైన పేరుకున్న రాసాయినాలు పోతాయి. బజార్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు దొరుకుతాయి. వీటిని ఎప్పటి కప్పుడు వంటల్లో వదేయాలి. నిల్వ ఉంచితే పొట్టు ఉంటేనే మంచిది. గాలికి వెలుతురికి వాటిల్లో వుండే వాసన రుచి పోతుంది. టొమాటో ఫ్రిజ్ లో ఉంచితే వాటిల్లో వుండే పోశాకాలైన లికోపిన్ ఫైటో న్యూట్రియంట్లు యంటి ఆక్సిడెంట్ గుణాలు తగ్గిపోతాయి.

Leave a comment