భార్యాభర్తలు కలిసి ఉంటేనే బాంధవ్యం కలకాలం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనుకోవలసిన పనిలేదు. ఈ రోజుల్లో గ్లోబల్ కెరీర్ పుణ్యమో, చదువుల కోసమో, ఇతరత్రా మరే కారణం వల్లనో నేటి జంటలు విడివిడిగా వుంటున్నారు. అయితే ఈ భౌగోళిక దూరాల వల్ల బాంధవ్యం వాడిపోదు. నిజానికి ఇంత దూరంగా ఉండే వారిలోనే నిరంతరం లోతైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఫలితంగా ధృఢమైన బాంధవ్యం ఉంటుందని తాజా అధ్యయనం సాగింది. ఫోన్ కాల్స్, వీడియో చాట్స్, టెక్స్ట్ మెస్సేజుల నడుమ మామూలుగా కలిసి వుండేవారికంటే ఎక్కువ కబుర్లు దొర్లుతున్నాయట. చాలా విషయాలు ఓపెన్ గా షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ నడుమ సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. వాళ్ళ మధ్య కోపతాపాలు, విసుర్లు, కసుర్లకు తావులేదు. అంటే దూరంగా ఉన్నంత మాత్రాన ఆప్యాయతలు, అనురాగాలు పెరుగుతాయే తప్ప తరగవన్నమాట.
Categories
You&Me

దూరంగా ఉన్నా ప్రేమ తగ్గదు

Leave a comment