ఐస్ క్యూబ్స్ కోసం ట్రేలో నీళ్ళు పోసి ఫ్రిజ్ లో పెట్టేస్తాం. చల్లగా ఏదైనా తాగాలనుకొంటే ఈ క్యూబ్స్ ని పానీయాల్లో వేస్తాం. కానీ ఐస్ కరిగి పానీయాలు పలచగా అయిపోయి రుచి లేకుండా పోతాయి. రియూజబుల్ ఫుడ్ సేప్ ప్లాస్టిక్ ఐస్ క్యూబ్స్ లో నీరు ఉంటుంది. వీటిని ఫ్రిజర్ లో పెట్టేస్టే నీరు గడ్డకట్టి చల్లగా అయిపోతాయి. ఈ క్యూబ్స్ ని పానీయాల్లో వేస్తే ద్రవాలు చల్ల బడతాయి. కానీ క్యూబ్స్ లోని నీరు అందరు కలిసే అవకాశం ఉండదు. ఫ్రిజ్ లో గడ్డకట్టిన ఈ ప్లాస్టిక్ ఐస్ క్యూబ్స్ ని పానీయాల్లో పడేసి అవి చల్లగా అయిపోగానే తీసి కడిగేసి మళ్ళీ పెట్టెస్తే సరి పోతుంది. ఈ కరగని ఐస్ క్యూబ్స్ తో ద్రవాలు పలుచగా అవుతాయనే బాధ కూడా ఉండదు.

Leave a comment