Categories

ఒక వేళ ప్రకారం ఆహరం తీసుకొంటేనే ఆరోగ్యం ,వేళ తప్పి ఆహారం తింటేనూ ముఖ్యంగా రాత్రివేళ ఆలస్యంగా తినటం వల్ల శారీరక జీవక్రియ బాగా దెబ్బతింటుంది. హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. సాధారణంగా రాత్రి వేళ శరీర మెటబాలిజం తక్కువగా ఉంటుంది.ఒక నిర్ణీత సమయం భోజనం కోసం నిర్ణయించుకోకపోతే నిద్ర సమయం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా ఎసిడిటి ఇతర గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి. మానవ శరీరం ఒక జీవన గడియారం పద్దతిగా పని చేస్తుంది. నిద్ర ,వ్యాయామం ,భోజనం విశ్రాంతి ఇవన్ని వేళ ప్రకారం నిర్ణయించుకొంటేనే శరీరం మన మాట వింటుంది.