Categories
Soyagam

స్ట్రెయిట్ హెయిర్ కోసం కిచెన్ షెల్ఫ్ చికిత్సలు.

జుట్టుకి కిచెన్ షెల్ఫ్ చికిత్సలు ఎంతో మేలు చేస్తాయి. క్రమం తప్పని హాట్ ఆయిల్ ధెరఫి తో జుట్టుకు చక్కని పోషకాలు లభిస్తాయి. కొబ్బరి, ఆలివ్ ఆయిల్ కలిపి మాడు, శిరోజాలను మసాజ్ చేసి వేడి టవల్ తో శిరోజాలను కవర్ చేయాలి. తర్వాత షాంపూ తో వాష్ చేయ వచ్చు. అలాగే పాలు పట్టించి అరగంట తర్వాత షాంపూతో వాష్ చేయవచ్చు. పాలు శిరోజాలను తిన్నగా చేసేందుకు ఉపయోగపడతాయి. అలాగే పాలలో కొద్దిగా తేనె కలిపి పేస్తులా చేసి జుట్టుకు పట్టించాలి. అలాగే స్ట్రాబెర్రీలు, అరటి పండ్లు చిదిమి జుట్టును పట్టించుకోవచ్చు. ఇలాంటి చికిత్సలతో జుట్టు ఫ్లాట్ గా పట్టు కుచ్చుల్లా వుంటుంది. జుట్టు మృదువుగా సౌకర్యవంతంగా మలిచే ప్రభావం కొబ్బరి పాలల్లో వుంటుంది. కొబ్బరి పాలల్లో నిమ్మరసమ కలిపి ఫ్రిజ్లో ఉంచితే పైన మీగడ లాగా పొరలా ఏర్పడుతుంది. ఈ క్రీమ్ ని శిరోజాలకు పట్టించి వేడి టవల్ చుట్టుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూ తో స్నానం చేస్తే జుట్టు స్ట్రెయిట్ గా మెత్తగా మెరుపుతో మెరుస్తుంది.

Leave a comment