వేసవిలో విపరీతమైన చమటలతో తలలో దుర్వాసన ,చుండ్రు,జిడ్డు చికాకు పెడుతుంటాయి. ఇంట్లో దొరికే వస్తులతో ఒక ఫ్యాక్ వేస్తే ప్రయోజనకారంగా ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియాల్ ,యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. పోషకాలు అందించగలదు. ఇది దుర్వాసనకు కారణం అయ్యే బాక్టీరియాను తొలగించగలదు. నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ముక్కలుగా చేసి స్టౌపై ప్యాక్ లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి అందులో ఈ వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దీ సేపు వేయించి చల్లారనిచ్చి దాన్ని వడకట్టాలి వెల్లుల్లిలో ఉడికించిన ఈ నూనెను తలకు పట్టించి ఓ అరగంట ఆగి స్నానం చేస్తే జుట్టు,మాడుకూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment