నమ్మలేను ,జీవితంలో ఎప్పటికీ మర్చి పోలేను .ఇంత అద్భుతమైన ప్రదర్శనని అంటూ సుష్మా స్వరాజ్ హేమమాలిని డాన్స్ ప్రోగ్రామ్ ని ఆకాశానికి ఎత్తేశారు .ప్రవాస భారతీయ దివాస్ కన్వెన్షన్ 2019 వారాణాసి లో జరిగిన సందర్భంగా హేమమాలిని 90 నిమిషాల నిడివిగల డాన్స్ ను ప్రదర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు మంత్రులు హాజరైన ఈ కార్యక్రమంలో హేమమాలిని గంగా అవతారంలో ,ఆ జీవనది ఎలా కలుషితమైందో నృత్య రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు.