Categories
దీర్ఘాయుష్షు కోసం జన్యువుల పై చేసిన ఒక పరిశోధనలో నిరంతరం చదువుతూ ఉండేవాళ్ళు ఆయుష్షు 23 నెలలు పెరుగుతుందని తేల్చారు.కొన్ని వందల మంది పై ఈ పరిశోధన దీర్ఘకాలం సాగింది.పుస్తకపఠనం ద్వారా జీవితకాలం పెరగదని కాని చదవటం ద్వారా తెలుసుకోదగ్గ విషయాలు ఆరోగ్య స్పృహకి కొంత కారణం అవుతున్నాయి.వీరిలో జ్ఞాపకశక్తి ఎంత వయసు వచ్చినా పెరుగుతూనే ఉందని ఒత్తిడి ఆందోళన చాలా వరకు రావని ఈ కారణాల వల్ల వాళ్ళ జీవితకాలం ఎక్కువ ఉంటుందని తేల్చారు. పరిశోధనలో అసలు పుస్తకాలు చదవని వారి ఆరోగ్యంలో తేడాలు ఒత్తిడి సమస్యలు,జీవితంలో కష్టనష్టాలు సమర్ధంగా ఎదుర్కొనే సమర్ధతా లోపతోనే వాళ్ళు అనారోగ్యాలు కొనితెచ్చుకున్నారని పరిశోధనలు చెభుతున్నాయి.