Categories
కనీసం రోజుకు 38 గ్రాముల ఫైబర్ తినాలంటున్నారు పోషకాహర నిపుణులు.ఫైబర్ రక్తంలో చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది. ఈ ఫైబర్ కోసం ముఖ్యంగా బ్రౌన్ రైస్ తినాలని సూచిస్తున్నారు.కప్పు బ్రౌన్ రైస్ లో 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలంటే బ్రౌన్ రైస్ మంచి డైట్. అలాగే కొబ్బరి పాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొబ్బరి రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది కూడా. ఇక కాబూలి శనగల్లో పోషకాల్తోపాటు మాంగనీస్ ఐరన్ పీచు కూడ అధికమే.