Categories
ఫిట్ నెస్ కోసం రెగ్యులర్ గా వ్యాయామం చేసే వాళ్ళు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వ్యాయామ పరికరాలు ,మ్యాట్స్ వాడే ముందు ,వాడాక శుభ్రంగా తుడువాలి. మనం తీపుకు వెళ్ళిన టవల్ పైనే కేర్చోవాలి. వ్యాయామం చేశాక యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ సోప్ తో స్నానం చేయాలి. చర్మ సంరక్షణ కోసం జాగ్రత్తాలు తీసుకోవాలి. మేకప్ తో జిమ్ లో వ్యాయామం అస్సలు చేయకూడదు. డీ హైడ్రెడ్ కాకుండా నీళ్ళు తాగుతూ ఉండాలి. యాంటీ ఫంగల్ ఫౌడర్ శరీరంపైన బట్టలపైన కూడా చల్లుకోవాలి.