అడవి బాపి రాజు గారి చిత్రాలలో సముద్ర గుప్తుని చిత్రం చాలా ప్రసిద్ధి. భారతదేశ చరిత్రలు అత్యంత సమర్థులైన యుద్ధ నాయకులలో ఒక దాని చరిత్రకారుడు వి.ఏ.స్మిత్ రాశారు బహుముఖప్రజ్ఞాశాలి ,రచయత కళాకారుడు అయిన అడవి బాపి రాజు గీసిన సముద్ర గుప్తుడి చిత్రంలో కనిపించే నారింజ రంగు మోహంలో ప్రశాంతత ఎంతో గొప్పగా ఉంటుంది. బాపి రాజు గారు చిత్రాలు గీసే పద్ధతి చాలా ప్రత్యేకం అంటారు. కళ్ళు తప్ప చిత్రం మొత్తం చిత్రించాక కొబ్బరి కాయకొట్టి హారతి ఇచ్చి ఆ తరువాత కళ్ళను గీసేవారట. ఈయన గీసిన చిత్రాలు డెన్మార్క్ ప్రదర్శన శాలలోను తిరువాన్ కూర్ మ్యుజియం లోను ఉన్నాయి.

Leave a comment