ఎదైన పార్టీలో మెరిసిపోవాలి ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటే ముందుగా అనార్కాలీ వైపు చూడండి అంటున్నారు స్టైలిస్టులు. హై వెయిస్టెడ్ స్కర్టులు క్రేప్ జార్జేట్‌ వి బావుంటాయి. జతగా టీ షర్ట్ ఇన్ షర్ట్ చేస్తే మరింత అందం. బ్రోకెడ్ వస్త్రంతో బాక్స్ ప్లీటెడ్ స్కర్ట్ పార్టీ లుక్ ఇస్తుంది. అలాగే జార్జెట్ లో ఫ్రంట్ సీ కట్ స్కర్ట్‌ వేసుకున్న కొత్తగా ఉంటుంది. ముదురు ఎరుపు, గులాబీ తెలుపు, నీలం రంగులు స్మార్ట్ లుక్ ని ఇస్తాయి. పొడవాటి పట్టిలుండే పెద్ద హ్యాండ్ బ్యాగ్ చక్కని చెప్పులు అందన్నిస్తాయి. రాతి వేళ పార్టీలైతే నలుపు ఎరుపు రంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. బంగారు,వెండి రంగులున్న సిక్వేన్సు ఉన్న దుస్తులు మరింత మెరిపిస్తాయి.

Leave a comment