నీహారికా,

ఏదైనా ఒప్పించాలంటే వీళ్ళతో తలప్రాణం తోకకి వస్తుంది. ఒక పట్టాన వింటారా? చివరకు అరచి, తిట్టి నాకు ఆయాసం వస్తేనే వాళ్ళో దారికి వచ్చేది అని చాలా మంది కంప్లెయింట్ . కానీ ఎక్స్ పర్ట్స్ ఏమంటున్నారంటే, పిల్లలకు, వాళ్ళను మీరెంతో ప్రేమిస్తున్నారన్న విషయాన్ని చెప్పారా? మీ మమకారాన్ని వాళ్ళు రుచి చూశారా? అప్పుడు మీరేదైనా విషయం చెప్పితే వాళ్ళు కాడంతున్నారా ఆలోచించ మంటున్నారు. మనం ప్రేమా తో చెప్పాలి. దాని వెనుక నా తల్లి దండ్రులు నా ఆనందాన్ని, నా భవిష్యత్తుని కోరుకుంటున్నారాణి పిల్లలకు తెలిస్తే వాళ్ళు దేన్నీ కాదనరు. ఒక వేల పిల్లలు ఇంకా విసిగించినా, దాన్ని పెద్దవాళ్ళు అర్ధం చేసుకోవాలి. ఉదాహరణకు వాళ్ళు ఎం పార్కుకొ వెళ్ళాలనుకుంటే, దాన్ని ఖచ్చితంగా పెద్దవాళ్ళు కాదంటే, ఆ పార్కు లో వాళ్లకు దొరికే ఆనందం ముందర పెద్దవాళ్ళ కోపం తక్కువే కావచ్చు. అలాంటి సందర్భాన్ని పెద్దవాళ్ళు అర్ధం చేసుకుని పిల్లల కోరిక తీర్చాలి. మన ఉద్యోగాలు, టార్గెట్ లు, తీరిక లేని పనులు ఇవన్నీ అర్ధం చేసుకునే వయస్సు లేకపోవచ్చు కానీ మనకు పిల్లల కోరిక లో వున్న బలం తెలుసు కదా? వాళ్ళ ఇష్టం తీర్చడం మన బాధ్యతే మరి!

Leave a comment