Categories
నీరు బాగా మరిగించి ,ఆ నీరు కాస్త గోరువెచ్చగా అయ్యాక తాగుతూ ఉంటే ఊదర సంబంధమైన రుగ్మతలు ఏవి రావు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఈ కాచిన నీటిలో చల్లని నీరు కలిపి తాగకూడదు. వేడి నీరే కాస్త చల్లారే వరకు ఆగాలి. రోజంతా గొరువెచ్చని నీరు తాగుతూ ఉంటే జీర్ణశక్తి మెరుగు పడుతుంది అంటారు పరిశొధకులు. ఆకలి కలుగుతోంది. కడుపు ఉబ్బరం,దగ్గు, జలుబు ,ఆయసం వంటివి తగ్గిపోతాయి. విటమిన్ సీ అందాలంటే స్పూన్ నిమ్మరసం కలిపి తాగవచ్చు. కీళ్ళ నొప్పులు ఈ వేడి నీరు తాగటం ఒక ఉపశమనం. కేంద్ర నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడి ఒత్తిడి తగ్గిపోతుంది.కానీ ఎక్కువ వేడిగా ఉన్న నీరు తాగితే రుచి మొగ్గలు దెబ్బతిని ఆహారం రుచి తెలియకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే గోరు వెచ్చని నీరే తాగాలి.